పవన్ బాకీ తీరిపోయిందా?

ఎంత బంగారు పళ్లానికైనా గోడ చేర్పు తప్పదు. ఎంత పవర్ స్టార్ అయినా ఒక దశలో ఫైనాన్సియల్ గా బాగా ఇబ్బంది పడ్డారు పవన్ కళ్యాణ్. గతంలో అనేకానేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్…

ఎంత బంగారు పళ్లానికైనా గోడ చేర్పు తప్పదు. ఎంత పవర్ స్టార్ అయినా ఒక దశలో ఫైనాన్సియల్ గా బాగా ఇబ్బంది పడ్డారు పవన్ కళ్యాణ్. గతంలో అనేకానేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ కాస్త భారీ మొత్తమే నిర్మాత కమ్ ఫైనాన్సియర్ పివిపికి బకాయి పడ్డారని అప్పట్లో వార్తలు వినవచ్చాయి. అప్పట్లో పెద్ద మనుషులు కలుగచేసుకుని, వడ్డీ మాఫీ చేసి, ఆ డబ్బులను అడ్వాన్స్ గా చేసి పివిపికి సినిమా చేసేలా ఒప్పందం కుదిర్చారని వార్తలు వినవచ్చాయి. 

కానీ తరువాత తరువాత పివిపికి పవన్ కు మధ్య టెర్మ్స్ కాస్త మారాయి. ఇద్దరి మధ్య జనసేన ఆరంభంలో వున్న అటాచ్ మెంట్ 2014ఎన్నికల తరువాత లేకుండా పోయింది. ఆ క్రమంలో భాగంగా పవన్ తను పివిపికి బాకీ వున్న మొత్తాన్ని చాలా వరకు తిరిగి ఇచ్చేసారని వార్తలు వినవచ్చాయి. అయితే ఇంకా మూడుకోట్ల వరకు బకాయి వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే ఈ మేరకు పివిపి కార్యాలయానికి చెందిన కీలక వ్యక్తి పవన్ మనుషులను కలిసారని, త్వరలో పంపేస్తామని సమాధానం వచ్చిందని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. నిజానికి ఇప్పుడు పవన్ ఫుల్ సౌండ్. ఆయన మైత్రీ మూవీస్, హారికహాసిని సినిమాలకు దగ్గర దగ్గర 40నుంచి 50కోట్ల మధ్యలో పారితోషికం అందుకున్నారు. కాటమరాయడు సినిమాకు కూడా శరత్ మరార్ దగ్గర నిర్మొహమాటంగా తన డిమాండ్ మేరకు పారితోషికం తీసుకున్నట్లు గుసగుసలు వున్నాయి. 

అందువల్ల పివిపికి బకాయి వుండి వుంటే, అది కూడా మూడుకోట్లు అయితే ఇట్టే చెల్లింపు చేసేయగలరు. ఎటొచ్చీ జనసేన పార్టీ కోసం మాత్రం కాస్త నిధులు సమకూర్చుకోవాలి. అందుకోసం అయినా సినిమాలు చేయాలి.