సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చాలా ఛూజీగా, సెలక్టివ్ గా సినిమాలుచేస్తూ, కెరీర్ ను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య చాలా గ్యాప్ వస్తే, జనం ఏమిటో అనుకున్నారు. ఆయన వైపు నుంచి మాత్రం కథలు వింటున్నా.. కథలు వింటున్నా అన్నదే సమాధానం అయింది. ఆ విషయంలో సురేష్ క్యాంప్ దగ్గర రాజీ అన్నది వుండదు. అందుకే వెంకీతో చాలా పేర్లు వినిపించినా, మెటీరియలైజ్ కాలేదు.
అలాంటిది ఇప్పుడు దాదాపు మూడు నాలుగు ప్రాజెక్టులు ఓకె చేసి పెట్టుకున్నారు వెంకీ అని తెలుస్తోంది. మూడు అన్నది క్లియర్ గా కనిపిస్తున్నాయి. తేజ, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్. ఇది కాక మరో సినిమా కూడా ఓకె చేసారని విశ్వసనీయ వర్గాల బొగట్టా.
ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా సడెన్ గా బయటకు వచ్చింది కానీ, లేదూ అంటే తేజ, అనిల్ రావిపూడి, తరువాత ఆ ప్రాజెక్టునే వుండేదని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు వివరాలు మాత్రం ఇంకా క్లియర్ గా బయటకు రాలేదు.
అంటే ఇప్పుడు టోటల్ గా వెంకీ చేయబోయేవి నాలుగు సినిమాలు. సో, 2019వరకు వెంకీ డైరీ ఫుల్ అయిపోయిందన్నమాట. సీనియర్లు అయినా వెంకీ, నాగ్, బాలయ్య భలే చకచకా సినిమాలు చేస్తున్నారు.