ఈసారి కూడా తెలంగాణ అమ్మాయే!

ఫిదా సినిమాతో సాయిపల్లవి అదరగొట్టింది. తెలంగాణ బిడ్డగా ఆ సినిమాలో ఆమె యాక్టింగ్, డైలాగ్ డెలివరీని ఎవరూ మరిచిపోలేరు. తెలుగు భాష, తెలంగాణ యాస నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు తన…

ఫిదా సినిమాతో సాయిపల్లవి అదరగొట్టింది. తెలంగాణ బిడ్డగా ఆ సినిమాలో ఆమె యాక్టింగ్, డైలాగ్ డెలివరీని ఎవరూ మరిచిపోలేరు. తెలుగు భాష, తెలంగాణ యాస నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు తన రెండో తెలుగు సినిమాలో కూడా తెలంగాణ పిల్లగానే కనిపించనుంది సాయిపల్లవి.

నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ సినిమాలో కూడా తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది సాయి పల్లవి. సినిమా మొత్తం వరంగల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే హీరోహీరోయిన్లు ఇద్దరిదీ తెలంగాణానే. కానీ ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

ఫిదా సినిమాలో తెలంగాణ యాస ఉంది కాబట్టి రొటీన్ అవుతుందని భయపడి ఎంసీఏలో హీరోయిన్ కు ఆ యాస పెట్టలేదు. పేరుకు వరంగల్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ హీరోయిన్ నార్మల్ గానే మాట్లాడుతుంది. ఈ క్యారెక్టర్ కు కూడా సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంది సాయిపల్లవి.

యూరోప్ లో తీసిన 2పాటలతో తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వదిన-మరిది మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో తెరకెక్కిన ఎంసీఏ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది.