ఫ్యాన్స్ కూడా ఫీలర్లు వదిలేస్తున్నారు

బోయపాటి శ్రీనివాస్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పని మీద బిజీగా వున్నారు. హీరో బాలయ్య యేమో కేఎస్ రవికుమార్ సినిమా మీద బిజీగా వున్నాడు. వ్యవహారం ఇలా వుంటే బోయపాటి తరువాతి సినిమా…

బోయపాటి శ్రీనివాస్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పని మీద బిజీగా వున్నారు. హీరో బాలయ్య యేమో కేఎస్ రవికుమార్ సినిమా మీద బిజీగా వున్నాడు. వ్యవహారం ఇలా వుంటే బోయపాటి తరువాతి సినిమా మీద ఫీలర్లు వినిపించడం ప్రారంభించాయి.

బోయపాటి మహేష్ కు ఓ సోలో లైన్, ఓ మల్టీస్టారర్ లైన్ చెప్పారు. అలాగే బాలయ్యకు అదే మల్టీ స్టారర్ లైన్ చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు కాస్త టైమ్ తీసుకుంటుంది. ఎందుకంటే మహేష్ కు రెండు మూడు కమిట్ మెంట్లు వున్నాయి కనుక.

ఈలోగా వచ్చే సమ్మర్ లో బాలయ్య బర్త్ డే నాడు బోయపాటి డైరక్షన్ లో సినిమా ప్రారంభిస్తారని వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతానికి బాలయ్య ఒక్క స్క్రిప్ట్ ఓకె చేసి వున్నారు. అది ఎస్వీ కృష్ణారెడ్డిది. దానికి ప్రొడ్యూసర్లు ఎన్నారైలు. అయితే ఇప్పుడు బాలయ్య తరువాతి ప్రాజెక్టు అదేనా? కాదా? అన్నది తేలాల్సి వుంది. ఈలోగా బోయపాటి ఫీలర్ బయటకు వచ్చింది.

దీనివెనుక ఫ్యాన్స్ హ్యాండ్ వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కు బాలయ్య మల్టీస్టారర్ చేయడం కన్నా, బోయపాటితో సోలో సినిమా చేస్తేనే బాగుంటుందని ఆకాంక్ష అని తెలుస్తోంది. అందుకే ఫ్యాన్స్ వైపు నుంచి ఈ ఫీలర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి దాకా వెంటనే చేసే సినిమానే బాలయ్య ఫిక్స్ చేయలేదు, ఆ తరువాత వచ్చే సినిమా సంగతి ఏం చెబుతారు? ప్యాన్స్ ఆతృత కానీ.