ఇండస్ట్రీలో ఇప్పుడు దాదాపు అందరూ యంగ్ హీరోలే. ఒకరి కోసం తయారుచేసిన కథ మరో హీరోకైనా నప్పుతుంది. అందుకే ఒకరి దగ్గర ప్రాజెక్టు సెట్ కాకపోతే, వేరే వాళ్ల దగ్గరకు వెళ్లిపోతున్నారు డైరక్టర్లు.
గతంలో మిస్టర్ నోకియా, రన్ వంటి సినిమాలు అందించిన అనిల్ కన్నెగంటి కొన్ని కథలు తయారుచేసుకున్నారట. అందులో ఓ కథ బన్నీకి చెపితే చూద్దాం, చేద్దాం అన్నారని తెలుస్తోంది. దీంతో అతగాడు అలా అలా రోహిత్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ప్రాజెక్టు సింగిల్ సిటింగ్ లో ఒకె అయింది కానీ నిర్మాత సెట్ కాలేదు.
ఈలోగా బన్నీకి ఈ విషయం తెలిసి, కబురు చేసి, తన మిత్రుడు బన్నీ వాస్ ద్వారా ఆ కథ హక్కులు కొనిపించేసాడట. కథ తమకు ఇచ్చేయమని, డైరక్షన్ తాము చేయించుకుంటామని కాస్త మంచి ఆఫర్ ఇవ్వడంతో అనిల్ కన్నెగంటి కథ ఇచ్చి వచ్చేసాడని తెలుస్తోంది. మరి బన్నీ ఈకథను ఏ డైరక్టర్ చేతిలో పెడతారో?
ఇదిలా వుంటే ఇదే అనిల్ కన్నెగంటి మరోకథను డైరక్టర్ కేఎస్ రవికుమార్ కు అమ్మేసాడని తెలుస్తోంది. ఈ కథను రవికుమార్ నిర్మాత సి కళ్యాణ్ కోసం కొన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కథకులు డైరక్టర్లు అవుతుంటే ఇతగాడు రివర్స్ గేర్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.