అనుభవం వుంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వుంటే అనుభవం వస్తుంది. ఇలాంటి మాట చాలా మంది వినే వుంటారు. పెళ్లయితే పిచ్చి కుదరుతుంది. పిచ్చి కుదిరితే పెళ్లవుతుంది అనేలాంటిదే ఇదీనూ.
దేశంలో ఏ క్వాలిఫికేషనూ అక్కర్లేని ఉద్యోగం ఒకటి వుంది. సినిమా హీరో అయిపోవడం. కానీ దానికీ ఓ క్వాలిఫికేషన్ కావాలి. టాలీవుడ్ లో. మన నాన్నో, అన్నో సినిమా సెలబ్రిటీ కావాలి. అప్పుడు ఏ అనుభవం లేకపోయినా, హీరో అయిపోవాలని అనుకోవచ్చు. అయిపోవచ్చు.
చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయినపుడు ఏ అనుభవం వుంది? లోకేష్ బాబు మంత్రిగా ఏ అనుభవంతో అయ్యారు? ఎన్టీఆర్ ఏ అనుభవంతో ముఖ్యమంత్రి అయ్యారు? అసలు ఏ అనుభవంతో పవన్ పార్టీ పెట్టారు?
ఆ మాటకు వస్తే చిరంజీవి ఏ అనుభవంతో ముఖ్యమంత్రి కావాలనుకున్నారు? ఏ అనుభవంతొ పార్టీని అమ్మేసారు. సారీ, కలిపేసారు. ఏ అనుభవంతో కేంద్ర మంత్రి అయ్యారు?
ఏమిటో జగన్ దగ్గరకు వచ్చేసరికే పాపం పవను బాబుకి అనుభవం గుర్తుకువస్తోంది. లోకేష్ దగ్గర, కేటిఆర్ దగ్గర ఏ అనుభవం ఆయనకు కనిపించిందో? ఈ దేశంలో అనేకానక మంది తొలిసారి సిఎమ్ లు, తొలిసారి మంత్రులు, ఏ అనుభవం లేకుండానే అయ్యారని పవన్ కు ఎవరన్నా చెప్పండర్లా. అలా వదిలేయకండి. అలా వదిలెస్తే, జనసేనలో రేపు కొత్త మొహాలు వుండవు. అనుభవుం వుంటేనే రండి అంటారు. బాగా అనుభవం పండిపోయిన వారికే టికెట్ లు ఇస్తారు.
అన్నట్లు పవన్ ఎప్పటికీ పోటీ చేయరేమో? ఎందుకుంటే ఆయనకు అనుభవం ఎప్చటికీ రాదు కదా?