Advertisement


Home > Movies - Movie Gossip
మహానటి మార్కులు కొట్టేసింది

క్వాలిటీ ఎలా వుందో తెలియడానికి వస్తువును ఆద్యంత చూడక్కరలేదు. అలా జస్ట్ ఓ లుక్కేస్తే తెలిసిపోతుంది. దాన్నే ఇంకోలా కూడా చెప్తారు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చాలు అని.

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్రపై దర్వకుడు నాగ్ అశ్విన్ అందిస్తున్న చిత్రం మహానటి. ఈ సినిమాలో హేమా హేమీ సెలబ్రిటీలు అంతా ఓ భాగం అవుతున్నారు. కీర్తి సురేష్, దుల్హర్ సల్మాన్, సమంత, దర్శకుడు క్రిష్, రామ జోగయ్య శాస్త్రి, బుర్రా సాయి మాధవ్ ఇలా చాలా మంది కనిపించబోతున్నారు. అలనాటి మాయాబజార్ ఘటోత్కజుడి ఎపిసోడ్ ఈ సినిమాకు కీలకం.

ఇలాంటి సినిమా టైటిల్ ప్లస్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇప్పుడు బయటకు వదిలారు. మాయాబజార్ లో మాయాదర్పణం ప్రియదర్శినిని అలనాటి శశిరేఖ గెటప్ లో సావిత్రి తెరవడం దానిలో మహానటి టైటిల్, డేట్ రావడం అన్నది టీజర్ గా చిత్రీకరించారు.

కానీ దాంట్లోనే అలనాటి మేటి సినిమాల్లోని డైలాగులు, సాంగ్ బిట్ లు అలా అలా వినిపించడం అద్భతంగా వుంది. టైటిల్ సిజి వర్క్ చాలా బాగుంది. ఈ సినిమా మార్చి 29న విడుదవుతుంది.