టెక్నాలజీ ప్రేమను మార్చేసింది

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా,…

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. జూలై 21న విడుదల కాబోతోన్న సందర్భంగా దర్శకుడు చెందు ముద్దు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలు

ఓ స్వచ్చమైన ప్రేమ కథను చెప్పాలని అనుకున్నాను. అందుకే 80ల నేపథ్యంలో కథను తీసుకెళ్లాను. అలా అని ఇప్పుడు స్వచ్చమైన ప్రేమ కథలు లేవని కాదు. కానీ నా సినిమాలోని పాత్రలో ఎంతో స్వచ్చంగా, అమాయకత్వంగా ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రేమను వ్యక్తపరిచే విధానం మారింది. అందుకే పాత కాలంలోకి తీసుకెళ్లి కథను చెప్పాలని అనుకున్నాను.

వేరే సినిమా కోసం చైతన్య రావ్ నా దగ్గరకు వచ్చి ఆడిషన్ ఇచ్చారు. కానీ ఆయనలో వింటేజ్ లుక్ ఉందని ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. ఫోటో స్టూడియోకి కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ ఉంటుంది. అందుకే సినిమా పేరు కూడా అదే పెట్టాం.

నేనేం అనుకున్నానో ఆ సినిమాను తీశాను. కొత్త దర్శకుడిని అయినా కూడా నిర్మాత యశ్ రంగినేని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఓ బిగ్ బ్రదర్‌లా నాకు అండగా నిలిచారు. సినిమా విషయంలో ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. బడ్జెట్ ఎక్కువ అని తెలిసినా కూడా ఇందులో రెండు పాటలు ఎస్పీ చరణ్ గారితో పాడించారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. క్లీన్‌గా ఉంటుంది. ఎక్కడా బోల్డ్ సీన్లు ఉండవు. రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది.