ఈ కార్టూన్ మనకు వర్తించదా?

ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నది ఓ మాట. ఈనాడు దినపత్రికలో కార్టూన్లు చూస్తుంటే ఒక్కోసారి ఇలాగే అనిపిస్తుంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ అన్న ప్రక్రియను కార్టూన్ లో వాడింది ఎక్కువగా ఈనాడులోనే అన్నది పాఠకులకు…

ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నది ఓ మాట. ఈనాడు దినపత్రికలో కార్టూన్లు చూస్తుంటే ఒక్కోసారి ఇలాగే అనిపిస్తుంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ అన్న ప్రక్రియను కార్టూన్ లో వాడింది ఎక్కువగా ఈనాడులోనే అన్నది పాఠకులకు తెలిసిన సత్యమే. అయితే లీడింగ్ డైలీ, మేధావి వర్గ కార్టూనిస్టు కాబట్టి నడచిపోయింది. ఇదే పని సోషల్ మీడియాలో చేస్తే మాత్రం అరెస్టులు, కేసులు.. ఈనాడు కార్టూన్లలో జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినంత ఎక్కడా జరగలేదన్నది వాస్తవం. అదే పనిని సోషల్ నెట్ వర్క్ లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, లోకేష్ బాబుకు వ్యతిరేకంగా చేస్తే అరెస్టులు, కేసులు తప్పలేదు.

లేటెస్ట్ గా ఈనాడులో వచ్చిన కార్టూన్ చూస్తే, ఇదే కార్టూన్ కనుక, ఇదే విధంగా జస్ట్ సోనియా బదులుగా చంధ్రబాబును వేసి, రాహుల్ పేరు బదులు లోకేష్ అన్న పేరు వాడి వుంటే, ఆంధ్రలో కచ్చితంగా కేసులు పడి వుండేవి అనిపిస్తుంది. రాజకీయ పార్టీ నాయకులను గొర్రెలతో పోల్చినందుకు, తమను అవమానించారంటూ పలువురు పలు స్టేషన్లలో కేసులు వేసి వుండేవారు. వెంటనే సదరు సోషల్ నెట్ వర్క్ ఏక్టివిస్ట్ ను పోలీసులు తీసుకెళ్లి లోపల వేసి వుండేవారు.

ఇంతకీ ఈనాడులో వచ్చిన కార్టూన్ ఏమిటి? కాంగ్రెస్ నాయకులు గొర్రెల మాదిరిగా వుంటారు. వారి చేత రాహుల్.. రాహుల్ అని అనిపించడానికి సోనియా ట్రయినింగ్ ఇస్తుంటారు. నిజమే కావచ్చు, సోనియా గాంధీ కావాలని రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దారనే అనుకుందాం. కానీ రాహుల్ ఒక్కసారిగా ఈ ఎన్నికల ముందో, గత ఎన్నికల ముందో వచ్చి పడలేదుగా పార్టీ మీద. ఇప్పడికి దశాబ్దకాలానికి ముందుగానే పార్టీలో వుంటూ వస్తున్నారుగా. ఎంపీగా ఎన్నికయ్యారుగా నేరుగా ప్రజల నుంచి.

మరి అదే తెలుగుదేశం పార్టీలో లోకేష్ పరిస్థితి ఏమిటి? ఆయనను నేరుగా పార్టీ కీలక స్థానానికి ఎవరు తీసుకెళ్లారు? చంద్రబాబు ప్రమేయం లేకుండానే, ఆయన ఆసక్తిని గమనించకుండానే తెలుగుదేశం నాయకులు అంతా లోకేష్.. లోకేష్ అంటూ నామజపం చేస్తున్నారా? మరి ఇదే కార్టూన్ లోకేష్ మీదుగా వేసే ధైర్యం లేదా చొరవ అదే మీడియా ఎందుకు చేయదు? పోనీ ఇదే కార్టూన్ ను అటు ఇటు మార్చి మళ్లీ సోషల్ నెట్ వర్క్ లోకి ఎవరైనా వదిలతే, తెలుగుదేశం పార్టీ నాయకుల స్పందన ఎలా వుంటుంది? పోనీ ఆ సంగతి అలా వుంచితే, సోషల్ నెట్ వర్క్ కార్టూన్లపై చర్యలు తీసుకునే పోలీసులు, ఇదే కార్టూన్ పై ఆంధ్రలో కాంగ్రెస్ నాయకులు పోరపాటున స్పందించి (అంత సీన్ వుంటుందని అనుకోవడానికి లేదు) ఫిర్యాదు చేస్తే, కాస్తయినా స్పందన వుంటుందని అనుకోవచ్చా? అనుమానమే.