జనవరి బరిలో విష్ణు

రోబో 2డేట్ తేలిపోయింది. ఇక తెలుగు సినిమాలు ఒకటి ఒకటిగా డేట్ లు సెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే జనవరి 26న యువి వారి భాగమతి సినిమా వుంది. అలాగే అదే డేట్ కు ఏకె…

రోబో 2డేట్ తేలిపోయింది. ఇక తెలుగు సినిమాలు ఒకటి ఒకటిగా డేట్ లు సెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే జనవరి 26న యువి వారి భాగమతి సినిమా వుంది. అలాగే అదే డేట్ కు ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా ఒకటి వచ్చే అవకాశం వుంది. అయితే అది నిఖిల్ దా, రాజ్ తరుణ్ దా అన్నది తేలాల్సి వుంది. మంచు విష్ణు తన ఆచారి అమెరికా యాత్ర సినిమాకు కూడా జనవరి 26డేట్ నే ఫిక్స్ చేసుకున్నారు.

పలు కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ లో ప్రజ్ఞ జైస్వాల్  హీరోయిన్ గా నటిస్తోంది. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.

అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మల్లాది వెంకట కృష్ణ మూర్తి అందించిన కథకు, డార్లింగ్ స్వామి మాటలు సమకూర్చారు.