అక్కినేని వారి ఇంటి కోడలైన సమంత ఇప్పట్లో సినిమాలకి స్వస్తి చెప్పడానికి ఇష్టపడడం లేదు. నటిగా కొనసాగాలని వుందనే తన కోరికని ఆమె భర్త నాగచైతన్య సమ్మతించడంతో ఇకపై కూడా నటించడానికే సమంత సిద్ధంగా వుంది. అయితే పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలే తప్ప కొత్తగా ఆమె ఏవీ టేకప్ చేయలేదు.
ఇదిలావుంటే త్వరలోనే నిర్మాణంలోకి అడుగు పెట్టాలని సమంత భావిస్తోంది. ఆమెకి నిర్మాతగా మారాలనే కోరిక చాలా కాలంగా వున్నా కానీ ఇంతవరకు ధైర్యం చేయలేదు. ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ తనకి అండగా వుంటుంది కనుక, నిర్మాతగా నాగార్జున అనుభవం బాగా కలిసి వస్తుంది కనుక సమంత నిర్మాతగా మారాలని అనుకుంటోందట.
కన్నడలో విజయవంతమైన యు టర్న్ చిత్రాన్ని తెలుగు, తమిళంలోకి రీమేక్ చేయాలనేది సమంత ప్లాన్. ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్ ఎక్కింది. ఇటీవలే చైతన్యతో కలిసి సమంత బెంగళూరు వెళ్లి ఆ చిత్ర దర్శకుడు పవన్‌తో చర్చించి వచ్చిందట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో సమంత ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది.