ఏ.ఆర్. రహమాన్ అఫీషియల్‌గా చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రం నుంచి వైదొలగడంతో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ దీనికి మ్యూజిక్ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి పని చేయడానికి తమన్ సిద్ధంగా వున్నా కానీ ఇంకా అతడికి సైరా బృందం నుంచి పిలుపు రాలేదట. ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి ఎవరూ తనని కాంటాక్ట్ చేయలేదని తమన్ స్పష్టం చేసాడు. తమన్ పేరు పరిశీలనలో వుంది కానీ దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని టీమ్ చూస్తోందట.
ఈ చిత్రం తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ రిలీజ్‌ని చిరంజీవి వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చిత్రానికి బాహుబలి మాదిరిగా జాతీయ వ్యాప్త గుర్తింపు తీసుకురావడం కోసం ప్రత్యేక కృషి జరుగుతోంది. అయితే ఇంతవరకు సెట్స్ మీదకి వెళ్లని ఈచిత్రంపై జరుగుతోన్న జాప్యం అభిమానులని అసహనానికి గురి చేస్తోంది.