ఎవరు సీఎం అవుతారు అన్నది కీలకం కాదని, ఆంధ్రలో ఓ స్టేబుల్ ప్రభుత్వం ఇవ్వడమే ముఖ్యమని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నేషనల్ మీడియాతో చెప్పారు.
భాజపా, జనసేన, తేదేపా ప్రభుత్వం వస్తే ఎవరు సీఎం అవుతారు అంటే పవన్ సమాధానం ఇది. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను బట్టి, బలాబలాలను బట్టి అప్పుడు నిర్ణయాలు వుంటాయన్నారు.
ఈ లెక్కన చూస్తే పవన్ సీఎం కావడం లేదని క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కు పొత్తు ధర్మం కింది 50 సీట్లకు మించి కేటాయించదు తెలుగుదేశం పార్టీ. అందులో అణుమాత్రం సందేహం అక్కరలేదు.
125 చోట్ల పోటీ చేసే తెలుగుదేశం ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, 50 చోట్ల పోటీ చేసే జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అన్నది బేరీజు వేసుకుంటే పవన్ కు సీఎం చాన్స్ రావడం అన్నది అసంభవం.
ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెండు పార్టీలకు కలిసి 100 సీట్లు రావాలి. పవన్ యాభై సీట్లు గెల్చుకుంటే తేదేపా యాభై గెల్చుకుంటే సరిసమానం అవుతారు. అప్పుడు షేరింగ్ కు ఒప్పుకోవాల్సి వుంటుంది. లేదూ జనసేనకు ఏమాత్రం తగ్గినా చాన్స్ వుండదు. పవన్ కు ఈ క్లారిటీ వుంది. కానీ లేనిదల్లా ఆయన పార్టీ జనాలకే.