పవన్ ‘గివింగ్’…’స్పెండింగ్’

ఢిల్లీ వెళ్లిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్టీటీవీ ప్రతినిధితో మాట్లాడారు. ఆ మాటల్లో రెండు చిత్రాలు గమనించవచ్చు. మొదటిది ఈ దేశ ప్రగతి కోసం మోడీకి మరో టెర్మ్ అవకాశం ఇవ్వాలన్నది…

ఢిల్లీ వెళ్లిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్టీటీవీ ప్రతినిధితో మాట్లాడారు. ఆ మాటల్లో రెండు చిత్రాలు గమనించవచ్చు. మొదటిది ఈ దేశ ప్రగతి కోసం మోడీకి మరో టెర్మ్ అవకాశం ఇవ్వాలన్నది పవన్ మాట. 

కానీ ఇక్కడ గమ్మత్తేమిటంటే పవన్ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి మోడీ ప్రభుత్వం రావడం ఇష్టం లేదన్నది. పైకి చెప్పినా, చెప్పకున్నా లోపల వున్న కోరిక అయితే అదే. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కేంద్రంలో వుండగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆటలు సాగవు. 

ఇదిలా వుంటే తెలుగుదేశం పార్టీ ని అభిమానించే, ఆ పార్టీని నమ్ముకునే సామాజిక వర్గం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటోంది తప్ప వేరు కాదు.

ఇలా మోడీ ప్రభుత్వం మీద అస్సలు సానుకూల ధోరణి లేని, మోడీ ప్రభుత్వం పాలు పంచుకునే ఎన్టీఎ లో స్థానం లేని తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకు వెళ్లాలని పవన్ అనుకుంటున్నారు. అంటే ఇదో తరహా రాజకీయ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట.

మాట దాటేసారు

సరే ఈ ముచ్చట ఇలా వుంటే, ఎన్టీటీవీ ముందు పవన్ ఆంధ్ర ప్రభుత్వం తప్పులు అన్నీ ఏకరవు పెట్టారు. బాగానే వుంది. ప్రతిపక్షంగా అలాగే మాట్లాడాలి. కానీ మధ్యలో 10 రూపాయల వడ్డీకి అప్పులు తెస్తున్నారు. తెచ్చి…’గివింగ్’ అని టక్కున ఆగిపోయి మాట మార్చి…’స్పెండింగ్ టు రన్ ది గవర్నమెంట్’ అనేసారు. 

నిజానికి చెప్పాల్సింది ‘గివింగ్ టు ది పీపుల్’ అని కదా చెప్పాలి. జగన్ చేస్తున్నది అదే కదా. అప్పులు చేసి అయినా జనాలకు పంచడం. కానీ అది చెప్పడానికి పవన్ కు మనసు రాలేదు. అలా చెబితే జగన్ కు పాజిటివ్ అవుతుంది. జనాల దగ్గర పవన్ కు నెగిటివ్ అవుతుంది.

కానీ నేషనల్ మీడియాకు మాత్రం తెలియదా ఆంధ్రలో జగన్ చేస్తున్నది ఏమిటో?