మాజీ సీఎం కన్నుమూత!

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమన్ చాందీ (80) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస…

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమన్ చాందీ (80) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన‌ట్టు ఆయ‌న కుమారుడు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

ఊమన్ చాందీ గ‌త కొంత కాలంగా క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.  కేరళ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయ‌న 1967-69 వ‌ర‌కు ఆ శాఖ‌కు అధ్య‌క్షుడిగా చేశారు. 1970లో కేర‌ళ రాష్ట్ర యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు.

27ఏళ్ల వ‌య‌సులో తొలిసారి పుతుపల్లి నియోజ‌వ‌ర్గం నుండి అసెంబ్లీకి అడుగుపెట్టారు. 12సార్లు అక్క‌డి నుండే ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. రెండు సార్లు కేర‌ళకు ముఖ్య‌మంత్రిగా పని చేశారు. కేరళ శాసనసభలో ఎక్కువ కాలం పనిచేసిన ఎమ్మెల్యేగా మరియు ఐక్యరాజ్యసమితి నుండి ప్రజా సేవకు అవార్డును సాధించిన ఏకైక భారతీయ ముఖ్యమంత్రిగా రికార్డ్ కూడా ఉంది.