ఈ ఏడాది కమల్ సినిమా లేనట్టే!

విశ్వరూపం-2సినిమా ఏ క్షణానైనా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు కమల్. కానీ అతడు చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదు. తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. 10రోజుల పాటు ఈ…

విశ్వరూపం-2సినిమా ఏ క్షణానైనా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు కమల్. కానీ అతడు చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదు. తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. 10రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఓవైపు షూటింగ్ జరుగుతున్న సినిమా డిసెంబర్ లో వస్తుందని ఊహించడం దాదాపు భ్రమే అవుతుంది. 

తాజాగా జరుగుతున్న షూటింగ్, సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూలా.. లేక రీషూట్ చేస్తున్నారా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఎటొచ్చి షూటింగ్ మాత్రం నడుస్తోంది. అందుకే మొన్న పుట్టినరోజు నాడు కూడా విశ్వరూపం-2ఊసెత్తలేదు కమల్ హాసన్. ఆరోజు ట్రయిలర్ వస్తుందని ఊహించారు చాలామంది.

అటు కమల్ నటిస్తున్న మరో మూవీ శభాష్ నాయుడు పరిస్థితి కూడా ఇలానే ఉంది. కాలికి దెబ్బ తగలడంతో ఆ షూటింగ్ ఆపేసిన కమల్.. అప్పట్నుంచి మళ్లీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు. విశ్వరూపం-2, శభాష్ నాయుడు సినిమాలు రెండూ ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తాయని 4-5నెలల కిందట కమల్ ప్రకటించాడు. కానీ ఇప్పుడా రెండు సినిమాలు ఈ ఏడాది రావని తేలిపోయింది.