కొరటాలకు మరోసారి హ్యాండ్ తప్పదా?

దర్శకుడు కొరటాల శివకు ఇప్పటికే ఓసారి హ్యాండ్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇప్పుడు మరోసారి అతడికి హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ఈక్వేషన్ల పరంగా చూస్తే ఈసారి కూడా…

దర్శకుడు కొరటాల శివకు ఇప్పటికే ఓసారి హ్యాండ్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇప్పుడు మరోసారి అతడికి హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ఈక్వేషన్ల పరంగా చూస్తే ఈసారి కూడా చెర్రీ-కొరటాల సినిమా కష్టమే అనిపిస్తోంది.  

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ ప్రారంభంలో ఈ సినిమా ఉండొచ్చు. అంతకంటే ముందే కొరటాలతో చెర్రీ మూవీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం నడుస్తున్న రంగస్థలం సినిమాతో పాటు నిర్మాతగా చరణ్ చేస్తున్న సైరా ప్రాజెక్టు వల్ల కొరటాలతో సినిమా పట్టాలపైకి రాకపోవచ్చని తెలుస్తోంది. సో.. రాజమౌళితో సినిమా కోసం కొరటాలతో చేయాల్సిన మూవీని చరణ్ హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.

గతంలో కొరటాల-చరణ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమై ఆగిపోయింది. ఆ తర్వాత కొరటాల వరుసగా హిట్స్ కొట్టడం, రామ్ చరణ్ మరోసారి అతడికి అవకాశమివ్వడం తెలిసిందే. అలా రెండోసారి కొరటాల-చరణ్ కాంబోలో సినిమా ఎనౌన్స్ అయింది. కానీ ఈసారి రాజమౌళి కారణంగా ఈ సినిమా ఆలస్యమయ్యేలా ఉంది.

మరోవైపు కొరటాల కూడా ప్రత్యామ్నాయాల్లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేస్తున్న ఈ దర్శకుడు.. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ బిజీ అయిపోవడంతో.. బన్నీతో మూవీ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు.