ఈ ఏడాది నిర్మాతగా ఆరు సినిమాలు అందించి రికార్డు సృష్టించారు దిల్ రాజు. ఒక నిర్మాణ సంస్థ ఏడాదిలో ఆరు సినిమాలు అందించడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఇప్పటికి విడుదలయిన అయిదు సినిమాలు లాభాలు తెచ్చుకున్నవే. వచ్చే ఏడాది ఏడు సినిమాలు అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారట దిల్ రాజు.
ఇప్పటికే మహేష్ , రామ్, నితిన్, రాజ్ తరుణ్, నాలుగు ప్రాజెక్టులు అన్ని విధాలా రెడీగా వున్నాయి. ఇవన్నీ టేకాఫ్ కు ఏ సమస్యా, ఆలస్యం లేని ప్రాజెక్టులు. ఇంకో మూడు ప్రాజెక్టులు ఏమిటన్నది తెలియాల్సి వుంది. ఇవన్నీ కూడా ఒకటి రెండు నెలల్లో సెట్ మీదకు వెళ్లిపోయేవే.
అంటే 2018ఫస్ట్ హాఫ్ లో పూర్తయిపోయే అవకాశం వున్నవి. అందువల్ల సెకండాఫ్ లో మరో మూడు నాలుగు లాగించేయగలరు దిల్ రాజు సబ్జెక్ట్ లు, డైరక్టర్లు దొరకాలే కానీ, నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోలు రెడీగా వున్నారు డేట్లు ఇవ్వడానికి.
అప్పుడు ఇదో రికార్డు అవుతుంది. టాలీవుడ్ లో అనేక పెద్ద సంస్థలు వున్నాయి కానీ ఇలా ఉద్యమం మాదిరిగా రెండు నెలలకు ఓ సినిమా తీసి విడుదల చేసే సంస్థ మాత్రం దిల్ రాజు ఎస్వీసీ ఒక్కటే నేమో?