మార్కెట్ లో దేనికి డిమాండ్ వుంటే దానికి సప్లయ్ వుంటుందన్నది ఎకనామిక్స్ సూత్రం. అదే విధంగా ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్ ఏది అయితే టాలీవుడ్ లో దాని మీదే గాలి వార్తలు పుట్టుకువస్తాయి. ఆ మధ్య అంతా ఎన్టీఆర్ బయోపిక్ అన్నది హాట్ టాపిక్. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నాడు. బాలయ్య ఎన్టీఆర్ అన్నారు. దాంతో అదిగో తేజ, ఇదిగో బయోపిక్, అదిగో తేజ ఇదిగో సినిమా అంటూ వార్తలు పుట్టించేసారు.
అప్పట్లోనే ఆఫ్ ది రికార్డుగా తేజ సన్నిహితులతో చెబుతూ వచ్చాడు. ఇప్పుడే కాదు, వెంకీ సినిమా అయిన తరువాతే, ఈ లోగా బాలయ్య కూడా మరో సినిమా చేస్తారు అని. కానీ అలా కాకుండా ఎన్టీఆర్ పుట్టిన రోజులు, వర్థంతులు వెదికి మరీ ఎవరి ముహుర్తాలు వాళ్లు పెట్టేసారు.
ఇప్పుడు ముహుర్తాలు దగ్గరకు వచ్చేస్తుంటే, తీరిగ్గా, బయోపిక్ ఇప్పుడే కాదు అంటూ మళ్లీ కొత్త పల్లవి అందుకుంటున్నారు. నిజానికి అసలు బయోపిక్ అన్నది ఇప్పట్లో వుంటుందా అన్నదే అనుమానం. ఎందుకంటే వర్మకు నాగార్జున సినిమా దొరికింది. ఓ ఆరు నెలలు ఆయన ఆ పని మీద వుంటారు. ఆ తరువాత అదృష్టం బాగుండి అది హిట్ అయితే మరో ప్రాజెక్టు వస్తుంది. అలా ప్రాజెక్టులు వస్తుంటే, వర్మ ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ జోలికి వెళ్లరు.
వర్మను అనవసరంగా కెలకడం ఎందుకు అని, అసలు బయోపిక్ ను కూడా అలా వుంచుతారు. బాలయ్యకు డిమాండ్ వున్నంత కాలం సినిమాలు చేస్తూ వుండోచ్చు. ఈ బయోపిక్ ది ఏముంది? ఎప్పుడైనా చేసుకోవచ్చు. పైగా ముహుర్తాలు పెట్టుకోవడానికి ఏడాదికి ఓ జయంతి, ఓ వర్థంతి వస్తూనే వుంటాయి.