ఇంద్రసేనకు యు/ఎ

బిచ్చగాడు, భేతాళుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ. బహుముఖ టాలెంట్ వున్న విజయ్ ఆంటోనీ హీరోగా సినిమాలు చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. Advertisement అంతే కాదు,…

బిచ్చగాడు, భేతాళుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ. బహుముఖ టాలెంట్ వున్న విజయ్ ఆంటోనీ హీరోగా సినిమాలు చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు.

అంతే కాదు, తెలుగు మార్కెట్ లో నిలదొక్కుకోవాలని సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. అది ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూంది. ఇంద్రసేన సినిమాను మంచి రేటుకు తెలుగులో నీలం కృష్ణా రెడ్టి కొన్నారు. కేవలం కొనడం మాత్రమే కాదు, ఓ స్ట్రయిట్ సినిమాకు తీసిపోని విధంగా పబ్లిసిటీ స్టార్ట్ చేసారు.

ఖర్చులు తరువాత చూసుకుందామని, ముందుగా సినిమాను ప్రజల్లోకి ఫుల్ పబ్లిసిటీతో తీసుకెళ్లాలని, అందుకోసం తను కూడా ఇక్కడ ఎన్ని రోజులు కావాలన్నా వుంటానని, విజయ్ ఆంటోనీ అనడంతో దానికి తగినట్లు ప్లాన్ చేసారు. చిరంజీవి తదితరులను కూడా విజయ్ ఆంటోనీ కలిసారు. మొత్తానికి ఆ విధంగా బజ్ సాధించారు. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.

ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెద్దగా పోటీ కూడా లేదు. కేవలం సాయి ధరమ్ తేజ జవాన్ ఒక్కటే వుంది. ఆ తరువాతి వారం కూడా పెద్దగా సినిమాలు ఇప్పటికి ప్లానింగ్ లో లేవు. వస్తే, గిస్తే, సప్తగిరి లేటెస్ట్ సినిమా సప్తగిరి ఎల్ ఎల్ బి వుండొచ్చు. అందువల్ల ఇంద్రసేన ఓపెనింగ్స్ పై మంచి హోప్ తో వున్నారు.