సుధీర్-శర్వా సినిమాకూ పూజ

హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం మీద మూడు సినిమాలు ప్లాన్ చేసారు. మారుతి, సుధీర్ వర్మ, నందినీ రెడ్డి దర్శకులు. అయితే నందినీ రెడ్డి సినిమాకు సరైన…

హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం మీద మూడు సినిమాలు ప్లాన్ చేసారు. మారుతి, సుధీర్ వర్మ, నందినీ రెడ్డి దర్శకులు. అయితే నందినీ రెడ్డి సినిమాకు సరైన సబ్జెక్ట్ దొరకడం లేదు. దాంతో అది అలా పక్కన వుంది.

మారుతి-నాగ చైతన్య సినిమాకు సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. ఓకె అయిపోయింది. అందుకే పూజ చేసేసారు ఈ రోజు. సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమాకు సబ్జెక్ట్ ఓకె అయింది, కానీ ఇంకా చిన్న మార్పులు చేర్పులు వున్నాయి. అందుకే శర్వానంద్ ముందుగా హను రాఘవపూడి సినిమా మీదకు వెళ్లిపోయాడు.

అయితే అలా చేస్తే, ఈ సినిమా వుందా లేదా అన్న అనుమానాలు పుట్టుకువస్తాయి. అందుకే ఈ సినిమాకు కూడా పూజ చేసేస్తున్నారు. 27సోమవారం ఉదయం ఈ సినిమాకూ ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో వీలు చూసుకుని ఓ వారం రోజులు డేట్స్ ఇస్తానని శర్వానంద్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నెల నెలా డేట్స్ అడ్జస్ట్ చేస్తానన్నాడట.

అంతా బాగానే వుంది. కానీ శర్వానంద్ లీజర్ వర్కింగ స్టయిల్ తెలిసిన వాళ్లు మాత్రం, అతను అలా రెండు సినిమాలు ఒకేసారి చేస్తానని అంటే కాస్త డవుట్ పడుతున్నారు.