నాగ్ దర్శకుడ్ని పక్కనపెట్టిన వెంకీ

మొన్నటివరకు అక్కినేని కాంపౌండ్ లో కొనసాగాడు కల్యాణ్ కృష్ణ. నాగ్, నాగచైతన్య తో సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. తన మూడో ప్రయత్నంగా బంగార్రాజు స్క్రిప్ట్ తో నాగ్ ను మెప్పించలేకపోయాడు. అలా కాంపౌండ్…

మొన్నటివరకు అక్కినేని కాంపౌండ్ లో కొనసాగాడు కల్యాణ్ కృష్ణ. నాగ్, నాగచైతన్య తో సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. తన మూడో ప్రయత్నంగా బంగార్రాజు స్క్రిప్ట్ తో నాగ్ ను మెప్పించలేకపోయాడు. అలా కాంపౌండ్ నుంచి బయటకొచ్చిన కల్యాణ్ కృష్ణ, వెంకటేష్ కు ఓ కథ వినిపించాడు.

కల్యాణ్ కృష్ణ చెప్పిన స్టోరీ వెంకీకి కూడా నచ్చిందంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇక ఫైనల్ అయిపోతుందనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్టును వెంకీ పక్కనపెట్టేశాడు. కల్యాణ్ కృష్ణ స్థానంలో అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చాడు. ఓ మల్టీస్టారర్ కథతో వెంకీని ఇంప్రెస్ చేశాడు అనిల్ రావిపూడి.

ఈ సినిమాకు ఎఫ్-2 (ఫన్&ఫ్రస్టేషన్) అనే టైటిల్ అనుకుంటున్నాడు రావిపూడి. ప్రస్తుతం స్క్రీన్ ప్లే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మల్టీస్టారర్ స్క్రిప్ట్ లో మరో హీరోగా నాగచైతన్య లేదా రానాను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. వెంకీ అడిగితే వీళ్లిద్దరూ ఓకే అంటారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. 

తన రెగ్యులర్ సినిమాల్లానే వెంకీతో చేయబోయే మూవీ కూడా కంప్లీట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందంటున్నాడు రావిపూడి. దిల్ రాజు బ్యానర్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.