నంది అవార్డుల వ్యవహారం రాజుకోవడంలో గీతా ఆర్ట్స్ కు చెందిన బన్నీవాస్ పాత్ర కూడా ఇంతో అంతో వుంది. ఆయన ట్వీట్ తోటే వ్యవహారం స్టార్ట్ అయింది. అయితే జస్ట్ వన్ డే ముందు తెలుగుదేశం హైకమాండ్ దిద్దుడు చర్యలు స్టార్ట్ చేసింది. అలా అని తప్పు దిద్దుకునే పని కాదు. తప్పును బయటకు రానివ్వకుండా చేసే పని.
గీతా అధినేత అల్లు అరవింద్ కు ఓ మంత్రి ద్వారా వత్తిడి వచ్చినట్లు వదంతులు గుప్పుమన్నాయి. బన్నీవాస్ ను తగ్గమని చెప్పమని ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.
అయితే నిన్న సాయంత్రం బన్నీవాస్ మళ్లీ మరోసారి ట్వీట్ చేయడంతో అరవింద్ ఆ ఆదేశాలు బేఖాతర్ చేసారా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే నిన్న లేట్ నైట్ బన్నీ వాస్ మరో ట్వీట్ తో వ్యవహారం తేలిపోయింది.
‘‘నంది అవార్డుల విషయం ముగిస్తే అందరికీ మంచిది.. మౌనం వహించండి.. పనిలో పడండి..’’
ఇదీ బన్నీ వాస్ ఇంగ్లీష్ ట్వట్ ..’”its good for all to close down nandi issue. Calm down.. enjoy the work”
ఈ ట్వీట్ చూస్తుంటే రెండు విషయాలు తడుతున్నాయి. ఒకటి అరవింద్ గారిపై వత్తిడులు వచ్చిన మాట వాస్తవమే అన్నది. రెండవది ట్వీట్ లో ఎంజాయ్ ది వర్క్ మినహా మిగిలినంతా, ఆ వత్తిడి ఏ డైలాగ్ రూపంలో వచ్చిందో, ఆ డైలాగ్ ఇదేనా అన్నది.
ఇంతకీ బన్నీ వాస్ ఈ ట్వీట్ తో ఫుల్ స్టాప్ పెట్టినట్లా? లేక అన్యాపదేశంగా వచ్చిన వత్తిడిని వెల్లడించేనట్లా?