గరుడవేగ శాటిలైట్ @ 4 కోట్లు

మొతానికి గరుడవేగ శాటిలైట్ బేరం సెటిలయింది. జెమిని టీవీకి నాలుగు కోట్లకు మాట అయిపోయింది. ఈరోజు అగ్రిమెంట్ కావాల్సి వుంది. అందుకే జీవిత అండ్ కో ఈ రోజు చెన్నయ్ లో అదే పనిమీద…

మొతానికి గరుడవేగ శాటిలైట్ బేరం సెటిలయింది. జెమిని టీవీకి నాలుగు కోట్లకు మాట అయిపోయింది. ఈరోజు అగ్రిమెంట్ కావాల్సి వుంది. అందుకే జీవిత అండ్ కో ఈ రోజు చెన్నయ్ లో అదే పనిమీద వున్నారు. మొదటి నుంచీ అదే రేటు వుంది. మరో యాభై లక్షలన్నా వస్తుందని జీవిత అండ్ కో ఆశించారు. కానీ రాలేదు.

ఆఖరికి నాలుగు కోట్లకే ఫిక్సయిపోయినట్లు బోగట్టా. గరుడవేగ సినిమా నిర్మాతల అధృష్టం ఏమిటంటే, విడుదలకు ముందు శాటిలైట్ కాకపోవడం. అప్పుడు అయి వుంటే, కోటి నుంచి రెండు కోట్ల మధ్యకు పోయి వుండేది. సినిమా విడుదలయిన తరువాత మంచి రివ్యూలు రావడం, మంచి టాక్ రావడంతో మంచి శాటిలైట్ రేటు వచ్చింది.

అయితే జీవిత అండ్ కో కు గరుడవేగకు సంబంధించి ఫైనాన్స్ లు ఇంకా వున్నాయి. ఇప్పుడు వచ్చే నాలుగు కోట్లలో మూడు కోట్లు ఒకటే పద్దుకింద చెల్లుబాటుకు పోతుందని వినికిడి. ఇదిలా వుంటే నార్త్ డిజిటల్ రైట్స్ గొడవలు ఇంకా వుండనే వున్నాయి. వాటిని మెల్లగా ఏదో విధంగా సెటిల్ చేసుకుంటారు. ఆపైన రాజశేఖర్ తరువాతి ప్రాజెక్టు ఏమిటన్న దానిపై దృష్టి పెడతారు. మళ్లీ ఇదే బ్యానర్ లో సినిమా నిర్మాణం ప్రారంభించే అవకాశం వుంది.