ఆ ఫోటో అందుకా?

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కోసం అలాంటి టైమ్ లో ఆయన చడీ చప్పుడు లేకుండా, ఏ క్యాఫ్షన్ లేకుండా, ఓ ఫొటొ వదిలేసారు.…

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కోసం అలాంటి టైమ్ లో ఆయన చడీ చప్పుడు లేకుండా, ఏ క్యాఫ్షన్ లేకుండా, ఓ ఫొటొ వదిలేసారు. అది కూడా మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ లతో రాజమౌళి అత్యంత సన్నిహితంగా, కులాసాగా వున్న ఫొటో.

ఈ ఫోటో బయటకు రావడంతోనే సహజంగానే సంచలనం రేకెత్తించింది. కచ్చితంగా ఏదో విషయం వుందనే అందరూ అనుకున్నారు. అనుకుంటున్నారు. చెర్రీ, తారక్ ల కాంబినేషన్ లో రాజమౌళి సినిమా అన్నది క్షణాల్లో వైరల్ అయిపోయింది.

కానీ ఏ పక్కన నుంచీ అఫీషియల్ కన్పర్ మేషన్ అయితే లేదు. ఫిబ్రవరి వేళకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఖాళీ అయ్యేది లేదు. బోయపాటి, త్రివిక్రమ్ లతో సినిమాలు వున్నాయి. మరి రాజమౌళి సైలంట్ ట్వీట్ కు అర్థం ఏమిటి? ఈ కాంబినేషన్ లో సినిమా చేస్తాననా? ఇంకేదైనా మీనింగ్ వుందా? ఆ డాట్ లైన్ కు అర్థం ఏమిటి?

ఇంకో కోణంలో ఆలోచిస్తే, రాజమౌళి కావాలనే ఈ ఫోటో వదిలి వుండాలని అనిపిస్తోంది. ఈ మధ్య నాలుగైదు రోజులుగా ఇండస్ట్రీ, మీడియా మొత్తం.. కమ్మ, కాపు.. కమ్మ.. కాపు అంటూ హోరెత్తిపోతోంది. సోషల్ మీడియా అయితే మరీనూ. ఇలాంటి టైమ్ లో రాజమౌళి ఇటు మెగా, అటు నందమూరి హీరోలను వుంచుకుని ట్వీట్ చేసారు.

అంటే మీడియానో, సోషల్ మీడియానో హోరెత్తుతున్నట్లు. ఇండస్ట్రీలో కమ్మ, కాపు హీరోల మధ్య ఏ తకరారు లేదని ఇండైరక్ట్ గా చెప్పడానికి రాజమౌళి ట్వీట్ చేసారని కూడా అనిపిస్తోంది. మేము, మేము ఒకటే అన్న సందేశాన్ని మీడియాలోకి పంపించడానికి ఈ ఫోటోను వాడుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.

ఏమో ఏదయినా అయి వుండొచ్చు. ఎందుకంటే రాజమౌళి మీద కూడా ఆ మధ్య ట్విట్టర్ లో కుల ముద్రవేసి ట్రాల్ చేసారు. ఆ తరువాత ఆయన అన్ని సినిమాలకు ట్వీట్లు చేయడం ప్రారంభించారు. ఆ అపప్రధ పోగొట్టుకోవడానికి కూడా ఈ ఫోటో వదిలి వుండొచ్చు. అందువల్ల ఏమైనా కావచ్చు.