ఫాన్‌ వార్స్‌కి తెరలేపిన అల్లు క్యాంప్‌!

మెగా వర్సెస్‌ నందమూరి అభిమానుల మధ్య ఆధిపత్య పోరు ఎలాగుంటుందనేది తెలిసిందే. అయితే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ వయసు మీద పడ్డాక ఈ వార్స్‌ తగ్గిపోయాయి. నందమూరి, కొణిదెల వంశాల తర్వాతి తరం హీరోలు…

మెగా వర్సెస్‌ నందమూరి అభిమానుల మధ్య ఆధిపత్య పోరు ఎలాగుంటుందనేది తెలిసిందే. అయితే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ వయసు మీద పడ్డాక ఈ వార్స్‌ తగ్గిపోయాయి. నందమూరి, కొణిదెల వంశాల తర్వాతి తరం హీరోలు కూడా స్టార్స్‌ అయినా కానీ ఫాన్‌ వార్స్‌కి చోటు లేకుండా పోయింది.

అటు ఎన్టీఆర్‌ కానీ, ఇటు రామ్‌ చరణ్‌ కానీ ఇలాంటివి ప్రోత్సహించకపోవడం, అందరితో కలివిడిగా వుండడంతో ఫాన్స్‌లోను మార్పు వచ్చింది. ఏదో సోషల్‌ మీడియాలో కామెంట్లు మినహా రోడ్లెక్కి కొట్టుకోవడమనేది లేదు. అయితే నంది అవార్డుల ప్రకటన నేపథ్యంలో సడన్‌గా నందమూరి కుటుంబాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఒక వర్గం దాడికి దిగింది.

నందమూరి ఫ్యామిలీని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, సామాజిక వర్గం పేరు చెప్పి ఎటాక్‌ చేయడం కానీ మునుపెన్నడూ ఈ స్థాయిలో జరగలేదు. ఈ వ్యవహారంలో రివోల్ట్‌ అవుతోన్న ప్రతి ఒక్కరికీ అల్లు ఫ్యామిలీతో సత్సంబంధాలు వుండడంతో తెర వెనక నుంచి దీనిని అల్లు వారే ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆల్రెడీ ప్రకటించిన అవార్డులని సవరించే వీల్లేకపోయినా కానీ ఈ గొడవ వల్ల అభిమానుల్లో ఒక విధమైన ఆవేశం చెలరేగింది. మునుపటిలా మళ్లీ ఫాన్‌ వార్స్‌కి ఈ వివాదం తెర తీసినా ఆశ్చర్యం లేదనే టాక్‌ వినిపిస్తోంది.