అఖిల్ సినిమా అక్కడ అయిదుకోట్లు

అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లోని హలో సినిమా మార్కెటింగ్ స్టార్ట్ అయింది. తొలిసారి ఫుల్ యాక్షన్ జోనర్ లో సినిమా తీస్తున్నాడు విక్రమ్ కుమార్. దీనికి స్వీట్ లవ్ స్టోటీ ప్యాడింగ్ వుంటుంది. అన్నపూర్ణ…

అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లోని హలో సినిమా మార్కెటింగ్ స్టార్ట్ అయింది. తొలిసారి ఫుల్ యాక్షన్ జోనర్ లో సినిమా తీస్తున్నాడు విక్రమ్ కుమార్. దీనికి స్వీట్ లవ్ స్టోటీ ప్యాడింగ్ వుంటుంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఇదే భారీ సినిమా. సుమారు 45కోట్ల మేరకు బడ్జెట్ ఖర్చయింది. ఒక్క యాక్షన్ ఎపిసోడ్స్ కే ఎక్కువ ఖర్చు చేసారు.

ఈ సినిమా మార్కెటింగ్ ను స్టార్ట్ చేసారు. సీడెడ్ బోణీ అయింది. అయిదుకోట్లకు కాస్త తక్కువగా సీడెడ్ హక్కులు ‘నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్’ టైపులో అగ్రిమెంట్ కుదిరింది. ఇక ఆంధ్ర, నైజాం, ఓవర్ సీస్ అమ్మాలి. బహుశా వైజాగ్ (మూడు జిల్లాలు) అన్నపూర్ణ నే నేరుగా పంపిణీ చేసే అవకాశం వుంది. మిగిలిన ఏరియాలు 15 నుంచి 20కోట్ల మధ్య రేషియోలో అమ్మే ప్రయత్నాలు షురూ అయ్యాయి.

నైజాంకు దిల్ రాజు ముందుకు రావడాన్ని బట్టి వుంటుంది. అమ్మడమా? డిస్ట్రిబ్యూషనా? అన్నది. మొత్తం మీద 45కోట్లు థియేటర్ రైట్స్ ద్వారా రావాలి. శాటిలైట్ వుండిపోతుంది. సీడెడ్ విక్రయించిన రేటు చూస్తుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదనే అనిపిస్తోంది.