పవన్ కోసం ఛానళ్ల మధ్య పోటీ

పవన్ సినిమా దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పై కూడా జోరుగా బెట్టింగ్ నడిచింది. సాధారణంగా పవన్ సినిమాలకు ఉండే…

పవన్ సినిమా దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పై కూడా జోరుగా బెట్టింగ్ నడిచింది. సాధారణంగా పవన్ సినిమాలకు ఉండే హైప్ కు తోడు.. ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దాదాపు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ అన్నీ ఈ శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు పోటీపడ్డాయి.

పవన్-త్రివిక్రమ్ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం 14కోట్ల రూపాయల నుంచి బేరం మొదలైనట్టు తెలుస్తోంది. మొదట స్టార్ మా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ ఆ మొత్తానికి నిర్మాతలు ఒప్పుకోలేదు. 20కోట్లకు శాటిలైట్ ఇవ్వాలనేది వాళ్ల టార్గెట్. మరోవైపు జీ తెలుగు ఛానెల్ 16కోట్ల వరకు వచ్చినా ఫలితం లేకపోయింది.

ఎట్టకేలకు జెమినీ టీవీ, అజ్ఞాతవాసి శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. ఏకంగా 19కోట్ల 50లక్షల రూపాయలకు ఈ డీల్ లాక్ అయినట్టు తెలుస్తోంది. రూ.19.5 కోట్లు అంటే నిర్మాత ఫిక్స్ చేసుకున్న ఎమౌంట్ కు దాదాపు రీచ్ అయినట్టే.