కవర్ చేసుకోలేక కిందామీద పడుతున్నాడు

నాలుగేళ్లు రీసెర్చ్ చేశారట. కాంప్రమైజ్ కాకుండా తీశారట. అలా ఆడియన్స్ ను భయపెట్టడానికి అన్ని హంగులతో గృహం సినిమాను సిద్ధం చేశారు. హిందీలో ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఈమధ్యే “ది హౌజ్ నెక్ట్స్…

నాలుగేళ్లు రీసెర్చ్ చేశారట. కాంప్రమైజ్ కాకుండా తీశారట. అలా ఆడియన్స్ ను భయపెట్టడానికి అన్ని హంగులతో గృహం సినిమాను సిద్ధం చేశారు. హిందీలో ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఈమధ్యే “ది హౌజ్ నెక్ట్స్ డోర్” పేరిట విడుదలైంది.

అయితే దీనికి అక్కడ డబ్బింగ్ మూవీ అనే మార్క్ పడ్డంతో సిద్ధూ ఇబ్బంది పడుతున్నాడు. అది స్ట్రయిట్ సినిమా అని చెప్పడానికి కిందామీద పడుతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కించామంటున్నాడు సిద్దార్థ్.

హిందీలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసుకొని, హిందీలో తీసిన ఈ సినిమాను బాలీవుడ్ మీడియా 'సౌత్ సినిమా'గా చూడడం ఏం బాగాలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఈ సినిమా బాగుందంటూ బాలీవుడ్ నుంచి రివ్యూస్ వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావట్లేదు.

మరోవైపు ఇదే సినిమా తెలుగు వెర్షన్ ను విడుదల చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు సిద్దార్థ్. 2 వారాల కిందటే తమిళ వెర్షన్ (అవల్) విడుదలైంది. తాజాగా హిందీ వెర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చింది. కానీ తెలుగులో “గృహం” ఎప్పుడొస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు సిద్ధూ. కుదిరితే 17న వస్తామని చెబుతున్నాడు కానీ కన్ ఫర్మ్ చేయలేకపోతున్నాడు.