మీ భర్తను మోసం చేయాలనిపిస్తోందా.. లేక మీ భార్యను ఛీట్ చేయాలని అనిపిస్తోందా.. భాగస్వామిని మోసగించాలని అనుకోవడానికి కూడా ఓ టైం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. 'జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్'లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం పెళ్లయిన ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య భర్తను మోసం చేయాలని భార్యకు అనిపిస్తుందట.
423మంది పెళ్లయిన మహిళలపై సర్వే నిర్వహించి ఈ విషయాన్ని తేల్చారు. వీళ్లంతా పెళ్లి చేసుకొని దశాబ్దం పాటు వైవాహిక జీవితాన్ని అనుభవించినవాళ్లే. పెళ్లయిన ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య వైవాహిక బంధం నుంచి తప్పుకోవాలనే కోరికను వీళ్లంతా వ్యక్తంచేశారు. వీళ్లలో మరికొంత మంది అక్రమ సంబంధాల వైపు కూడా దృష్టి సారించారు.
ఇక పెళ్లయిన పురుషుల విషయానికొస్తే ఈ టైం లిమిట్ కాస్త ఎక్కువే. పెళ్లయిన 11ఏళ్ల తర్వాత మాత్రమే పురుషులకు తమ భార్యల్ని ఛీట్ చేయాలనిపిస్తుందట. పిల్లలు పెద్దవాళ్లు అవ్వడం, భాగస్వామి డబ్బు సంపాదనతో బిజీ అయిపోవడం, జీవితంలో కొత్తదనం లేకపోవడంతో ఇలాంటి కోరికలు కలుగుతున్నాయని 95శాతం మంది మహిళలు, పురుషులు తమ అభిప్రాయాల్ని వ్యక్తంచేశారు. బ్రిటన్, స్కాట్లాండ్ లో నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది సదరు జర్నల్.