నిర్మాతగా శరత్ మరార్ ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. భారీ సినిమాలే చేసారు. భారీ అమ్మకాలే సాగించారు. కానీ సంతృప్తికరమైన విజయం లభించలేదు. పోనీ మెర్సాల్ తెలుగు వెర్షన్ ను చాలా రీజనబుల్ రేటుకు తీసుకున్నారు, మంచి ఫలితం అందుకుంటారు అన్న టైమ్ లో సెన్సారు కష్టాలు వచ్చి పడ్డాయి. హీరో విజయ్ టీమ్ పదే పదే చెప్పడంతో మెర్సాల్ విడుదలకు ముందుగానే పబ్లిసిటీ స్టార్ట్ చేసేసి కోట్లు ఖర్చు చేసేసారు. కానీ తీరా సెన్సారు కష్టాలు రావడంతో ఈ పబ్లిసిటీ ఖర్చు అంతా వృధా అయిపోయింది.
దానికి తోడు నాలుగు సినిమాల టఫ్ కాంపిటీషన్ లో అదిరింది విడుదలయింది. లక్కీగా తెలివిగా ఆలోచించి, ఓ రోజు ముందుగా విడుదల చేయడం పనికి వచ్చింది. తొలి రోజు కోటీ డెభై లక్షల వరకు షేర్ సంపాదించింది అదిరింది. మర్నాడు అంటే శుక్రవారం మాత్రం మూడు కొత్త సినిమాలు రావడంతో ఆక్యుపెన్సీ 65నుంచి 70 మధ్యలోనే వుండిపోయింది.
శని, ఆదివారాలు మాత్రం మళ్లీ పుంజుకుంటుందని, ఈవారం కాంపిటీషన్ లో తమ సినిమానే ముందు నిలుస్తుందని అదిరింది యూనిట్ భావిస్తోంది. దీనికి తోడు జీఎస్టీ డైలాగులు కలుపుతున్నారు. అందువల్ల ఫస్ట్ వీకెండ్ లో మూడు కోట్లకు పైగానే షేర్ సాధిస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అదిరిందికి అంతా కలిపి శరత్ మరార్ పెట్టుబడి నాలుగు కోట్లు మాత్రమే.
కొద్దిగా థియేటర్ అడ్వాన్స్ లు తీసుకున్నారు. అందువల్ల ఫస్ట్ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ కు వచ్చేసే అవకాశాలు వున్నాయి. అంటే మొత్తం మీద శరత్ మరార్ కు ఈసారి బయ్యర్ల టెన్షన్ వుండదు. పైగా ఈ చిన్న సినిమా మీద కాస్తో కూస్తో మిగులే వుంటుంది.