ఓవర్ సీస్ మార్కెట్ ఏమంత అద్భుతంగా లేదు. సినిమాలు కొంటున్న వారు ఎవరూ డబ్బులు చేసుకుంటున్న దాఖలాలు లేవు. కొన్నవాళ్లు కొన్ని సెంటర్లకు కిందకు అమ్మేయడంతో కాస్త కవర్ అవుతున్నారు. మిగిలినది లాస్ అవుతున్నారు.
కొనుక్కున్న కింది సెంటర్ల జనాలు కూడా వాళ్ల రేంజ్ లో కుదేలవుతున్నారు. ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఓవర్ సీస్ సినిమా అనుకున్నది కూడా బయ్యర్లకు కాసులకు బదులు కష్టాలే ఇచ్చింది. దీంతో కొత్త సినిమాలు కొనాలి అంటే కాస్త అచి తూచి బేరాలు ఆడుతున్నారు.
ఇప్పుడు ఈ సీన్ అంతా అక్కినేని అఖిల్ హలో సినిమా మీద పడింది. ఆ సినిమా ఓవర్ సీస్ ఇప్పటి వరకు అమ్ముడుపోలేదు. కనీసం ఆరు కోట్లు అన్నా ఓవర్ సీస్ మార్కెట్ నుంచి తెచ్చుకోవాలని హలో యూనిట్ ప్రయత్నం.
కానీ అదే సమయంలో అమెరికాలోని థియేటర్లు అన్నీ హాలీవుడ్ సినిమాలతో బిజీ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. తెలుగు సినిమాలకు డిసెంబర్ క్రిస్మస్ వీక్ లో థియేటర్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. దాంతో బయ్యర్లు హలో సినిమా కొనడానికి వెనుక ముందు ఆడుతున్నారు.
మరోపక్క ఆంధ్ర, నైజాం ఏరియాలు కూడా ఇంకా సెటిల్ కాలేదు. ఓ మాట అనుకునే స్టేజ్ లోనే వుంది తప్ప, అంతకన్నా ముందుకు వెళ్లలేదు.