అదిరింది సినిమా మొత్తానికి వచ్చింది. జీఎస్టీ విధానాన్ని విమర్శిస్తూ రాసిన లెంగ్తీ డైలాగులు అన్నీ మ్యూట్ చేసేసి మరీ సెన్సారు సర్టిఫికెట్ ఇచ్చినట్లున్నారని వార్తలు వినిపించాయి.
ఈపాటి దానికి తమిళ వెర్షన్ విడుదలయిన ఒకటి రెండు రోజులకే సర్టిఫికెట్ అలా కటింగ్ లతో ఇచ్చివుంటే, తెలుగు వెర్షన్ కు మరింత ఓపెనింగ్స్ వచ్చి వుండేవి కదా అనుకున్నారంతా.
అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న విషయం ఏమిటంటే, డైలాగులు మ్యూట్ చేయకుండానే సెన్సారు సర్టిఫికెట్ ఇచ్చారని. అక్కడ ఏదో టెక్నికల్ సమస్య వచ్చిందని, ఇప్పుడు డైలాగులు చేర్చుకునే అవకాశం వుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ నిర్మాత ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శనివారం పడే అదిరింది షో లతో జీఎస్టీ డైలాగులు వుండే అవకాశం వుంది.
అదిరింది ఫస్ట్ హాఫ్ కు ఫుల్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. సెకండాఫ్ కు ఈ జీఎస్టీ డైలాగులు తోడయితే మరింత జోష్ వస్తుందని అదిరింది యూనిట్ భావిస్తోంది.