ఎంసిఎ డిజిటల్ @ 5 కోట్లు

అమెజాన్ పుణ్యమా అని సినిమాలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ తెలుగు సినిమాలకు కాస్త భారీగానే చెల్లిస్తోంది. Advertisement లేటెస్ట్ గా నాని-సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ లో డిసెంబర్…

అమెజాన్ పుణ్యమా అని సినిమాలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ తెలుగు సినిమాలకు కాస్త భారీగానే చెల్లిస్తోంది.

లేటెస్ట్ గా నాని-సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ లో డిసెంబర్ 14న విడుదలవుతుందని భావిస్తున్న ఎంసిఎ సినిమాకు అమెజాన్ నుంచి మాంచి ఆఫర్ దక్కింది. ఓన్లీ డిజిటల్ రైట్స్ కింద అమెజాన్ తో అయిదు కోట్లకు నిర్మాత దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

ఇది కాక, మా టీవీతో శాటిలైట్ ఎలాగూ వుంటుంది. అది కూడా మరో అయిదు వరకు వచ్చే అవకాశం వుంది. అంటే డిజిటల్, శాటిలైట్ కలిపి పది కోట్లు అన్నమాట. 

అక్కడికి టోటల్ కాస్టింగ్, టెక్నికల్ రెమ్యూనిరేషన్ డబ్బులు వెనక్కు వచ్చేసినట్లే. ఇక కేవలం ప్రొడక్షన్ కాస్ట్ రావాలి. థియేటర్ల నుంచి అంతకు అంతా వచ్చే అవకాశమే వుంది. ఈ ఏడాది దిల్ రాజుకు నిర్మాతగా ఇది ఆరో సినిమా.