చందమామతో మొదలెట్టిన హీరోయిన్ కాజల్ ఇన్నింగ్స్ ముగిసిపోయాయి అనుకున్నారంతా. సీనియర్ హీరోల పక్కన చేరక తప్పదు అనుకున్నారు కూడా. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150సినిమాల తరువాత ఇంక అయిపోయింది అన్నారు.
కానీ ఇప్పుడు మళ్లీ కాజల్ నామ జపం చేస్తోంది టాలీవుడ్. రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసిన తరువాత కాజల్ పై అందరి చూపులు పడ్డాయి. దీంతో సురేష్ మూవీస్ సంస్థ వెంకీతో నిర్మించే సినిమా కోసం కాజల్ పేరు పరిశీలనకు తీసుకుంది.
ఇంతలో మరో మాంచి ఆఫర్ కాజల్ చెంతకు వచ్చింది. హీరో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు.
ఈ సినిమాలో కాజల్ కు మెయిన్ హీరోయిన్ పాత్ర దక్కింది. హీరోయిన్ పాత్ర రావడం కన్నా, శర్వానంద్ లాంటి యంగ్ హీరో పక్కన రావడం విశేషం. ఇప్పుడు శర్వానంద్ పక్కన మంచి జోడీ అనిపించుకుంటే, యంగ్ హీరోలు చాలా మంది కాజల్ తో వేయడానికి రెడీ అయిపోతారు. అప్పుడు అసలు సిసలు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది.