ఒక్కోసారి అవకాశాలు భలే చేజారతాయి. ఓ సినిమాలో నటించే అవకాశం కావాలని ఎవరూ చేజార్చుకోరు. కానీ ఒక్కోసారి అలా పరిస్థితులు తోసుకు వస్తాయి. ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో శహభాష్ అనిపించేసుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అలాంటి అనుపమను ఓ పెద్ద బ్యానర్ లో మంచి డైరక్టర్ తో, మంచి ప్రాజెక్టులో నటించే అవకాశం వెదక్కుంటూ వచ్చింది.
తీరా కథ వింటే, ఆ పాత్ర విషాదాంతం అని తెలిసింది. జస్ట్ ఇప్పటికే ఉన్నది ఒకటే జిందగీలో విశ్రాంతి వేళకే చనిపోయి, గోడ మీద ఫోటోకు దండ పడిపోయే పాత్ర చేసింది అనుపమ. మళ్లీ వెంటనే అదే విధంగా విషాదాంతమైన పాత్ర అనే సరికి, కాస్త ముందు వెనుక ఆలోచించి, సారీ అనేసినట్లు తెలుస్తోంది.
నిర్మాత, దర్శకుడు కూడా అనుపమ పరిస్థితిని అర్ధం చేసకుని వేరే హీరోయిన్ కోసం వెదుకులాట ప్రారంభించారట. ఉన్నది ఒకటే జిందగీ తరువాత వెంటనే కాకుండా, మధ్యలో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా వుంటే, అప్పుడు మళ్లీ ఇలాంటి పాత్ర అయినా ఓకె అనేసేది అనుపమ. కానీ అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ వరుసగా కావడంతో నో అనక తప్పలేదని వినికిడి.