త్రివిక్రమ్ బ్యాక్ ఎండ్ లో వుండి అందించిన సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్. ఇప్పటికీ జనాలు ఆ సినిమాను టీవీలో వచ్చినపుడో, యూ ట్యూబ్ లో కనిపించినపుడో ఎంజాయ్ చేస్తూనే వుంటారు. ఆ తరువాత అలాగే బ్యాకెండ్ లో వుండి అందించిన మల్లీశ్వరి కూడా అలాంటిదే.
మళ్లీ అలాంటి ఫ్యామిలీ వినోదాన్ని మరోసారి డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిచబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని నిర్మించే సినిమాకు సబ్జెక్ట్ ఇదే అని వినికిడి. వాస్తవానికి మిలటరీ అని, డిటెక్టివ్ నవల అని వినిపించింది కానీ, వాస్తవానికి పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో వినోదం సంగతి ఎలా వున్నా, అత్తారింటికి దారేది సినిమా తప్పిస్తే, మిగిలినవన్నీ కాస్త యాక్షన్ మిళితమైన మాస్ కమర్షియల్స్ నే త్రివిక్రమ్ అందించారు. సన్నాఫ్ సత్యమూర్తిలో కొద్దిగా మళ్లీ వెనక్కు వచ్చారు. ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ నే.
అందుకే ఈసారి ఎన్టీఆర్ తో మళ్లీ తన స్టయిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చూపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ కూడా అదే కావాలంటున్నారు. బృందావనం తరువాత మళ్లీ అలాంటి సినిమా పడలేదని, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, జైలవకుశ సీరియస్ ఎమోషనల్ సినిమాలు అయిపోయాయని, అందువల్ల ఒక రిలీఫ్ సినిమా కావాలని ఎన్టీఆర్ కోరుకుంటున్నారు.
సో అందువల్ల ఎన్టీఆర్ తో పక్కా ఫ్యామిలీ ఫన్ ఎంటర్ టైనర్ అందించాలని డిసైడ్ అయిన త్రివిక్రమ్ అదే తరహా సబ్జెక్ట్ ను తయారుచేసినట్లు తెలుస్తోంది. అంతే కానీ గాలి వార్తలు వండి వార్చినట్లు డిటెక్టివ్ స్టోరీ అయితే కానే కాదు.