మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. చిన్నయ్య అనే సీనియర్ పనివాడు రెండు లక్షలతో జంప్ జిలానీ అని పోలీసులకు చిరంజీవి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదుచేసారట. మరి ఫిర్యాదులో ఏముదో కానీ, ఇది తొలిసారి కాదని, అడపాదడపా ఈ పని చేసాడని మీడియాలో గుప్పమంది. అలా తీసిన మొత్తం పదిలక్షల వరకు వుంటుందని ఓ టాక్. సదరు చిన్నయ్య ఇప్పుడు పోలీసుల అదుపులో వున్నాడట.
అయితే ఇక్కడే అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. కేవలం రెండులక్షల కోసం ఫిర్యాదు చేసారా? రెండులక్షలు పెద్ద మొత్తమే. కానీ చిరంజీవి లాంటి వేలకోట్ల ఆస్తిపరుడికి, అది పెద్ద మొత్తం కాదు. పైగా ఆ లెవెల్ జనాలు ఇలాంటి చిన్న మొత్తం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి రచ్చ చేయరు. వీలయితే అవుటాఫ్ ది వే టాకిల్ చేసుకుంటారు.
ఎన్టీఆర్ సీఎంగా వున్నపుడు గండిపేట ఇంటి నుంచి ఫిలిం డబ్బాల్లో దాచిన భారీ మొత్తం దఫదఫాలుగా మాయమైంది. అప్పుడు ఇలాగే వార్తలు బయటకు పోక్కాయి. ఆ తరువాత చోరీకి పాల్పడిన వ్యక్తి దొరికాడు. కానీ ఆ పైన ఏమయిందో పెద్దగా బయటకురాలేదు.
సినిమారంగంలో మనుషుల్ని పట్టుకుపోయి, వసూళ్లు సాగించడాలు, సంతకాలు చేయించుకోవడాలు, ఆస్తులు రాయించుకోవడాలు చాలా కామన్. అలా కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది అంటే చాలా పెద్ద మొత్తం ఇన్వాల్వ్ అయి వుండాలని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లేదా ఏమైనా విలువైన వస్తువులు కూడా ఇన్ వాల్వ్ అయి వుంటాయేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు అదుపులోకి తీసుకుని వుండొచ్చని, తమ స్టయిల్ లో ప్రశ్నించి విషయం రాబట్టడానికి, ఓ ఫిర్యాదు అంటూ వుండాలి కాబట్టి, ఈ రెండులక్షల ఫిర్యాదు అంది వుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.