సమంత తర్వాత తెలుగు సినిమా నంబర్ వన్ క్వీన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఒకరిద్దరు తప్ప ప్రస్తుతం వున్న టాప్ హీరోలు అందరితోను నటించేసింది. చేయడానికి చాలా సినిమాలే చేసింది కానీ రకుల్ సక్సెస్ రేట్ మాత్రం సమంత మాదిరిగా లేదు.
ఈ ఏడాదిలో రకుల్ ప్రీత్ సింగ్‌కి 'రారండోయ్ వేడుక చూద్దాం' తప్ప మరో విజయం లేదు. విన్నర్, జయ జానకి నాయక, స్పైడర్‌లాంటి ఫ్లాప్‌లు రకుల్‌ని రేసులో వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం టాప్‌కి చేరుకునేంత వేగంగా దూసుకొస్తోన్న హీరోయిన్లు ఇంకెవరూ లేరు కానీ రకుల్‌కి అయితే అవకాశాలు తగ్గాయి.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. గత ఏడాది టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా వున్న రకుల్‌కి క్యాలెండర్ తిరిగే సరికి సీన్ రివర్స్ అయింది.
ప్రస్తుతానికి తనకి త్రెట్ అనిపించే యువ హీరోయిన్లు లేకపోవడంతో తనకి మళ్లీ బూమ్ వస్తుందని రకుల్ ఆశిస్తోంది. సమంతకి పెళ్లయిపోవడం కూడా ఆమెకి కలిసొచ్చే పాయింటే కానీ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రాకపోతే మాత్రం నిర్మాతలు తనని కన్సిడర్ చేసే అవకాశాలు తక్కువే మరి.