ఏదైనా ఆ ఇద్దరు హీరోలని దాటి రావాలి!

ఆరేడుగురు టాప్‌ స్టార్లని పక్కనపెడితే ప్రస్తుతం మిడిల్‌ రేంజ్‌ హీరోల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు పది మంది హీరోలు ఈ రేంజ్‌లో కథల కోసం, దర్శకుల కోసం పోటీలు పడుతున్నారు. అయితే…

ఆరేడుగురు టాప్‌ స్టార్లని పక్కనపెడితే ప్రస్తుతం మిడిల్‌ రేంజ్‌ హీరోల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు పది మంది హీరోలు ఈ రేంజ్‌లో కథల కోసం, దర్శకుల కోసం పోటీలు పడుతున్నారు. అయితే ఈ స్థాయి హీరోల్లో అత్యంత నిలకడ చూపిస్తోన్నది మాత్రం నాని, శర్వానంద్‌లే. వీళ్లిద్దరే ఏ కొత్త దర్శకుడికి అయినా మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయారు.

ఒక మంచి కథ వుంటే ఈ ఇద్దరు హీరోలని దాటి వేరే వాళ్లకి చేరడం కష్టమయిపోతోంది. వేగంగా సినిమాలు చేస్తున్నారు కనుక వీరి కోసం ఒక ఏడాది వేచి చూడడానికి కూడా నిర్మాతలు, దర్శకులు వెనకాడడం లేదు. ఈ ఏడాదిలో నాని సినిమాలు ఆల్రెడీ రెండు విడుదలయ్యాయి. మరొకటి డిసెంబర్‌లో రానుంది. శర్వానంద్‌వి ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి.

దీనిని బట్టి వీరి వేగం ఎలా వుందనేది అంచనా వేయవచ్చు. మంచి కథలుంటే అయితే నాని, లేదా శర్వానంద్‌ అంటూ వాటాలేసుకుంటున్నారు. దీంతో మిగతా హీరోలు తమకి దొరికిన కథలు, మిగిలిన దర్శకులతోనే చేసుకోవాల్సి వస్తోంది. దీంతో సహజంగానే నాని, శర్వానంద్‌ల సక్సెస్‌ రేట్‌ టాప్‌లో వుంటే, మిగతావాళ్లు విజయాల కోసం తంటాలు పడుతున్నారు.