ఫ్లాట్ సేల్ డీడ్ రాసిన రాజశేఖర్ ?

ఓ సినిమా విడుదల చేయాలంటే నిర్మాతలకు నరాలు తెగిపోతున్నాయ్. ఫైనాన్స్ తీసుకుని సినిమా తయారుచేసేటప్పుడు బాగానే వుంటుంది. కానీ విడుదలకు ముందు రోజు అది క్లియర్ చేసి, లెటర్ తీసుకోవడానికి జేజెమ్మ దిగి వస్తుంది.…

ఓ సినిమా విడుదల చేయాలంటే నిర్మాతలకు నరాలు తెగిపోతున్నాయ్. ఫైనాన్స్ తీసుకుని సినిమా తయారుచేసేటప్పుడు బాగానే వుంటుంది. కానీ విడుదలకు ముందు రోజు అది క్లియర్ చేసి, లెటర్ తీసుకోవడానికి జేజెమ్మ దిగి వస్తుంది. నిర్మాత జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్, ఇంకా మరి కొందరు కలిసి తెరకెక్కించిన గరుడ వేగ సినిమా పరిస్థితి ఇదే.

ఈ సినిమా కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. గరుడ వేగ మంచి సినిమా అని తెలుసు. ట్రయిలర్, టీజర్ బాగున్నాయి అని తెలుసు. కానీ అమ్మకాలు జరగలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటి వరకు ఈ తరహా సినిమాలు తీయకపోవడం, రాజశేఖర్ నటించి చాలా కాలం కావడం వంటి కారణాలు వున్నాయి.

సినిమాను ఆంధ్రలో సురేష్ మూవీస్ దగ్గర, సీడెడ్ లో సాయి కొర్రపాటి దగ్గర వుంచారు. నైజాంలో మర్కాపురం శివకుమార్ కోటి రూపాయిల అడ్వాన్స్ పై ఆడిస్తా అన్నారు. కానీ మరి ఈ మూడు కోట్ల ఫైనాన్స్ క్లియరెన్స్ ఎలా? థియేటర్ల అడ్వాన్స్ లు ఇలాంటివి ట్రయ్ చేసారు కానీ కాలేదని వినికిడి.

గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి దాటేవరకు ప్రయత్నాలు సాగాయి. కానీ ఫలించలేదని తెలుస్తోంది. ఆఖరికి రాజశేఖర్ తన స్వంత కమర్షియల్ ఏరియాలో సుమారు అయిదువేల ఎస్ ఎఫ్ టి ని గ్యారంటీగా సేల్ డీడ్ రాయడంతో ఫైనాన్స్ క్లియరింగ్ లెటర్ చేతికి అందినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి అంతా హ్యాపీనే. శాటిలైట్ అమ్మలేదు. అందువల్ల మంచి రేటు పలుకుతుంది. పర్సంటేజ్ లు పోయినా మూడు ఏరియాల్లో ఇంతో అంతో కలెక్షన్లు వస్తాయి. బాగా ప్రమోట్ చేస్తే, సినిమా నిల్చుండిపోయే అవకాశం వుంది. అప్పుడు రాజశేఖర్ ఫ్లాట్ మళ్లీ వెనక్కు రావడం పెద్ద చిత్రం కాదు. కానీ నిర్మాతల కష్టాలు తలుచుకుంటేనే, అయ్యో అనిపిస్తుంది.