పవర్ పుల్ పోలీస్ గా నాగార్జున ?

హీరో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఎన్ని వేసినా శివమణి తరువాతే. నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన పూరి డైలాగ్ ఇప్పటికీ పాపులర్ నే. ఆ తరువాత…

హీరో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఎన్ని వేసినా శివమణి తరువాతే. నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన పూరి డైలాగ్ ఇప్పటికీ పాపులర్ నే. ఆ తరువాత మళ్లీ నాగ్ సరైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయలేదు. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం వచ్చింది.

ఆర్జీవీ డైరక్షన్ లో నాగార్జున ఈ నెల 20న ప్రారంభించబోయే సినిమాలో ఆయన క్యారెక్టర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఈ క్యారెక్టరైజేషన్ నచ్చడంతోనే నాగ్ వెంటనే కథకు ఓకె చెప్పాడట. అందరూ అనుకుంటున్నట్లు, ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓకె అయినది కాదుట. కొద్ది నెలలుగా దీనిపై డిస్కషన్లు నడుస్తున్నట్లు వినికిడి.

ఆర్జీవీ తీయడం ఎలా తీస్తాడో కానీ, స్క్రిప్ట్, నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా సెట్ అయ్యాయని తెలుస్తోంది. అందుకే నాగ్ ఒకె అనడం, సినిమా ప్రారంభం కావడం జరిగిపోతోంది. మరి వర్మ చూపించే పోలీస్ ఆఫీసర్ గా నాగ్ ఎలా వుంటాడో చూడాలి.