ఒక్కోసారి అంతే. ప్రాజెక్టులకు మాంచి క్రేజ్ వస్తుంది. నిర్మాతకు అవసరమూ రావచ్చు. దాంతో సెట్ మీదకు వెళ్లకుండానే ప్రాజెక్టు సేల్ అయిపోతుంది. నిఖిల్ త్వరలో చేయబోయే గణితన్ తెలుగు రీమేక్ సినిమా సెట్ మీదకు వెళ్లకుండానే ప్రాజెక్టు స్టేజ్ లోనే అమ్ముడుపోయినట్లు తెలుసింది.
నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించాల్సి వుంది. అయితే స్పైడర్ కారణంగా ఆయన కాస్త ఇబ్బందుల్లో వున్నారు. మరీ సమస్యలు కాదు కానీ, మాంచి సినిమా అవుతుందనుకున్నది అలా కావడంతో, కాస్త డీలా పడ్డారు. ఇలాంటి టైమ్ లో గణితన్ ప్రాజెక్టుకు మాంచి బేరం వచ్చినట్లు తెలుస్తోంది.
ఓ పార్టీ వచ్చి 11కోట్లకు తమకు ఫస్ట్ కాపీ ఇమ్మని అడిగినట్లు, ఆ మేరకు అగ్రిమెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను ఠాగూర్ మధుయే నిర్మిస్తారు. కానీ ఆయనకు ఏమీ సంబంధం వుండదు. కేవలం ఎగ్జిక్యూషన్. ఈ సినిమాను ఏక్ట్యువల్ గా 7కోట్లలో ఫినిష్ చేయాలన్నది సంకల్పం. అలా చేయగలిగితే మధుకు నాలుగుకోట్లు లాభం వస్తుంది. లేదూ. ఎంతలో నిర్మిస్తే, 11కోట్లలో అది పోను మిగిలినది లాభం అవుతుంది.
మొత్తం మీద ఈ డీల్ నే బాగుందని చెఫ్పుకోవాలి. జాగ్రత్తగా ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఫలితం అన్నది కొన్నవాళ్లు చూసుకుంటారు.