పవన్ కొడుకు పేరు వెనుక ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండియాలో లేరు. యూరప్ లో అజ్ఞాత వాసి సినిమా పాటల షూట్ లో బిజీగా వున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ గ్యాసిప్ గుప్పుమంది. ఆయనకు ఇటీవలే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండియాలో లేరు. యూరప్ లో అజ్ఞాత వాసి సినిమా పాటల షూట్ లో బిజీగా వున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ గ్యాసిప్ గుప్పుమంది. ఆయనకు ఇటీవలే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ కొడుకు పేరు ఇదీ అంటూ వార్తలు బయల్దేరాయి. మార్క్ శంకర్ పవనోవిచ్ అన్నది పేరు అంటున్నారు.

ఇందులో శంకర్ అనగానే చిరంజీవి అసలు పేరు గుర్తుకువస్తుంది. తండ్రి పేరు కొడుకు పేరు చివర్న వుండడం అన్నది చాలాచోట్ల పద్దతిగా వుంది. అందువల్ల పవనోవిచ్ అని పెట్టి వుండొచ్చు. అయితే ఈ మార్క్ సంగతి ఏమిటి?

కేవలం క్రిస్టియన్ నేమ్ కోసం మార్క్ అని పెట్టారా?  లేక కార్ల్ మార్క్స్ పేరు కలిసి రావాలని పెట్టారా? పవన్ కు కాస్త కమ్యూనిస్టు భావజాలంపై ఫ్యాసినేషన్ వుంది. అందువల్ల మార్క్స్ పేరులోంచి ఎస్ తీసేసి మార్క్ అని పెట్టారని అనుకోవాలా? 

అసలు ఇంతకీ ఈపేరు నిజమేనా? ఫ్యాన్ మేడ్ డిజైన్ మాదిరిగా ఫ్యాన్స్ క్రియేషన్ అనుకోవాలా? పవన్ క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు.