ఇక కెరీర్ మీద చాలా సీరియస్ గా వున్నాడు నాగశౌర్య. అంటే ఇంతకు ముందు లేడు అని కాదు. సినిమాలు చేస్తున్నా, సరియైన టైమ్ రాకపోవడంతో, గ్యాప్ ఎక్కువై ఫలితం వుండడం లేదు. అందుకే ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. తన స్వంత సినిమా ఛలో ను ఎలాగైనా డిసెంబర్ 1న విడుదల చేయాలని పట్టుదలగా వున్నాడట.
అయితే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ పని ఇంకా చాలా వుంది. అయినా చకచకా లాగించాలని ట్రయ్ చేస్తున్నాడట. ఈ సినిమా తరువాత లైకా మూవీస్ నిర్మించిన తమిళ-తెలుగు సినిమా కణం విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత ఇప్పటికే చాలా వరకు షూట్ అయిన అమ్మమ్మ గారిల్లు సినిమాను రెడీ చేసేస్తాడట.
అంటే వరుసగా రెండు మూడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు అన్నమాట. ఇవి కాక కమిట్ అయినవి ఇంకో రెండు సినిమాలు వున్నాయి. అంటే 2018లో మినిమమ్ మూడు సినిమాలు చూపించబోతున్నాడన్నమాట నాగశౌర్య.