త్రివిక్రమ్ సినిమా కోసం కొత్తగా మారిపోతాడంటూ ప్రచారం జరిగింది. విదేశాలకు వెళ్లి మరీ న్యూ లుక్ తెచ్చుకుంటాడంటూ కథనాలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ మారడం లేదు. త్రివిక్రమ్ సినిమా కోసం ఎలాంటి మేకోవర్లు ప్రయత్నించడం లేదు. తన రెగ్యులర్ లుక్ తో ఎప్పట్లానే కనిపించబోతున్నాడు తారక్.
కాకపోతే కాస్త బరువు తగ్గే పనిలో మాత్రం పడ్డాడు. జై లవకుశ, జనతా గ్యారేజ్ సినిమాల్లో బొద్దుగా కనిపించాడు ఎన్టీఆర్. కానీ త్రివిక్రమ్ సినిమాలో అలా కనిపిస్తే కుదరదు. ఎందుకంటే ఇదొక ఫ్యామిలీ కమ్ లవ్ ఎంటర్ టైనర్. అందుకే బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ షూటింగ్ కు ఇంకా చాలా టైం ఉండడంతో, అప్పటికి స్లిమ్ లుక్ లోకి వచ్చేస్తాడు. అంతకుమించి న్యూ లుక్స్ లాంటివేం ప్రయత్నించడం లేదు.
తన సినిమాల్లో కథ, కథనంపై మాత్రమే ఎక్కువగా దృష్టిపెడతాడు త్రివిక్రమ్. పూరిజగన్నాథ్, సుకుమార్ లా హీరోలకు ఓ కొత్త లుక్ ఇవ్వాలని ఎప్పుడూ అనుకోడు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.