మగాడి చేతిలో ఆడది ఎప్పుడూ మోసపోవడమే. అనాదిగా మోసపోవడం స్త్రీకి అలవాటుగా మారిపోయింది. మనదేశంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. ఏ సినిమా చూసినా, సీరియల్ పెట్టినా ఇలాంటి డైలాగ్స్ కామన్. కానీ బ్రిటన్ లో మాత్రం ఈ తేడా కేవలం 10శాతం మాత్రమేనట.
తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. యూకేకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ 5వేల మంది పురుషులు, మరో 5వేల మంది స్త్రీలపై వేర్వేరుగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. భర్తను మోసం చేసి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నామని 30.9శాతం మంది మహిళలు అంగీకరిస్తే.. భార్యకు తెలియకుండా మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నామని 40.4 శాతం మంది పురుషులు వెల్లడించారు.
ఈ విషయంలో పురుషులు, స్త్రీల మధ్య తేడా కేవలం 10 శాతం మాత్రమే అంటోంది సదరు సర్వే. నిజానికి సర్వే చేసింది ఈ విషయంపై కాదు. భాగస్వామితో సెక్స్ జీవితం ఎలా ఉందనే అంశంపై సర్వే చేయాలని భావిస్తే ఈ విషయం బయటపడింది.