కాస్త నమ్మశక్యం కాని గ్యాసిప్ ఒకటి వినిపిస్తోంది. డైరక్టర్ సుకుమార్ కు హీరో రామ్ చరణ్, తమ కాంబినేషన్ లోని రంగస్థలం 1985 సినిమా గురించి ఈ గ్యాసిప్ వినిపిస్తోంది. మిగిలిన హీరోలు, డైరక్టర్లు, చకచకా సినిమాలు చేస్తుంటే, ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రారంభమైన రంగస్థలం 1985 నత్తనడక నడుస్తోంది. నిర్మాతలకు వడ్డీల ఖర్చు లెక్కవేసుకుంటే అమ్మో అనిపిస్తుంది. అంతలా చెక్కుకుంటూ వస్తున్నారు.
ఇలాంటి సినిమాకు సంబంధించి ఓ డెడ్ లైన్ పెట్టాడట రామ్ చరణ్. నవంబర్ తరువాత తను డేట్లు ఇవ్వలేనని, ఆ లోగానే తన వర్క్ వుంటే పూర్తి చేసుకోమని చెపేసాడని తెలుస్తోంది. డిసెంబర్ నుంచి రామ్ చరణ్ తను నిర్మించే మెగా సినిమా సైరా పనుల్లో బిజీ అవుతాడని తెలుస్తోంది. అందుకే ఈ డెడ్ లైన్ పెట్టినట్లు వినికిడి.
అయితే సుకుమార్ ఈ డెడ్ లైన్ మీట్ కాగలడా? అన్నది అనుమానం. ఎందుకుంటే రంగస్థలం 1985కు సంబంధించి కొన్ని పాటల పని ఇంకా పెండింగ్ లో వుండనే వుంది. మరి అవన్నీ ఎప్పుడు చేస్తారో? లేక రామ్ చరణ్ తన డెడ్ లైన్ ను పొడిగించుకుంటూ వెళ్తాడో? సినిమా రిలీజ్ డేట్ మాదిరిగా?