'రోబో' చిత్రంలో యాక్షన్ దృశ్యాలు అన్నిటినీ రజనీకాంత్ డూప్‌ని పెట్టుకుని, గ్రాఫిక్స్ సాయంతో కానిచ్చేసిన శంకర్ ఈసారి '2.0'కి దానిని మరింత విస్తృతంగా వాడాడేమో అనిపిస్తోంది. '2.0' పోస్టర్లలో రజనీకాంత్ ఒరిజినల్ లుక్ అయితే కనిపించడం లేదు. కేవలం ఫేస్‌ని ఫోటోషాప్ ద్వారా యంగ్‌గా చూపించిన దాఖలాలు కూడా లేవు.
ఫేస్ డైమెన్షన్ నుంచి బాడీ డైమెన్షన్స్ వరకు అన్నిట్లోను రజనీ నకలు సాక్షాత్కరిస్తున్నాడు. రోబో సినిమాకి పోస్టర్ల వరకు రజనీకాంత్‌నే వాడుకున్న శంకర్ ఈసారి పోస్టర్ల కోసం కూడా రజనీతో ఫోటోషూట్ చేసినట్టు లేడు. చూస్తోంటే '2.0'కి కేవలం క్లోజప్ షాట్స్ లాంటివి మాత్రం రజనీతో తీసి మిగతాదంతా టెక్నాలజీ సాయంతో చేసుకుపోయాడేమో అనిపిస్తోంది.
మరి ఈ డూప్ రజనీని ఫాన్స్ మరోసారి ఎగబడి చూస్తారా లేక కబాలి, కాలా సినిమాల్లో కనిపించే ఒరిజినల్ రజనీనే బెటర్ అంటారా? కేవలం తమిళ మార్కెట్‌ని మాత్రమే కాకుండా ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్‌ని కూడా శంకర్ ఈసారి టార్గెట్ చేసాడు. ఆ స్థాయిలో అబ్బురపరిచే గ్రాఫిక్స్ హంగులతో పాటు వినోదం వుంటుందా లేదా అనేది చూడాలి.