బాయ్ ఫ్రెండ్ లేని బాలీవుడ్ హీరోయిన్లు ఉండరు. కాకపోతే వీళ్లలో 2 రకాలు. కొంతమంది తమ ప్రేమను బయటకుచెబుతారు. మరికొంతమంది మాత్రం సీక్రెట్ గా డేటింగ్ చేస్తుంటారు. హీరోయిన్ జాన్వి కపూర్ రెండో టైపు. కొన్ని రోజులుగా ఈమె శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే శిఖర్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని మాత్రం జాన్వి అంగీకరించదు. అడిగితే ఫ్రెండ్ అంటుంది. కట్ చేస్తే, నైట్ పార్టీల్లో, సొంత కార్లలో ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని కనిపిస్తారు. తాజాగా అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.
రాత్రి అర్జున్ కపూర్ తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడు. అన్నయ్య ఆహ్వానాన్ని అందుకున్న జాన్వి కపూర్, పార్టీకి వచ్చింది. అయితే వస్తూనే తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ ను తీసుకొచ్చింది. జాన్వి-శిఖర్ తో పాటు.. వరుణ్ ధావన్ దంపతులు, మరికొంతమంది ఈ పార్టీకి హాజరయ్యారు.
స్వయంగా తన కారులో శిఖర్ ను పార్టీకి తీసుకొచ్చింది జాన్వి. వీళ్లిద్దరూ కలిసి ఇలా కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే పలుమార్లు నైట్ క్లబ్స్, పబ్స్ లో కనిపించారు. ఏప్రిల్ లో ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వచ్చారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు ఈ శిఖర్ పహారియా. ఇప్పటికే ఇతడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న జాన్వి, ఆ విషయాన్ని ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి.